Toopran: తూప్రాన్ అక్షర స్కూల్‌లో దీపం ఆకారంలో విద్యార్థుల విన్యాసం
Toopran: తూప్రాన్ అక్షర స్కూల్‌లో విద్యార్థులు మానవ దీపం ఆకారంలో కూర్చుని దీపావళి విశిష్టతను చాటారు. కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రిన్సిపాల్ ఉదయశ్రీ పిలుపునిచ్చారు.
Toopran: తూప్రాన్ అక్షర స్కూల్‌లో దీపం ఆకారంలో విద్యార్థుల విన్యాసం
తూప్రాన్: దీపావళి పర్వదినం సందర్భంగా తూప్రాన్ లోని అక్షర స్కూల్ లో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు వెలుగులు పంచే "దీపం" ఆకారంలో కూర్చుని పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. పైనుంచి చూస్తే పెద్ద దీపం ఆకారంలో కనిపిస్తున్న ఈ మానవ దీపం అందరినీ ఆకట్టుకుంది.
ఈ దీపాల పండుగ మనందరి జీవితాల్లో వెలుగును, విజయాన్ని అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఉదయశ్రీ విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
చీకటిపై వెలుగు విజయమే దీపావళి అని, విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




