Venkatayapalli: వెంకటాయపల్లిలో దళితులను అడ్డుకున్న వారిపై చర్యలు

Venkatayapalli: తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో పోచమ్మ గుడికి వెళ్లే దళితులను అడ్డుకుని దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కేవీపీఎస్, డీబీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

RAJU,TOOPRAN
Published on: 3 Nov 2026 3:43 PM IST
Venkatayapalli
X

Venkatayapalli: వెంకటాయపల్లిలో దళితులను అడ్డుకున్న వారిపై చర్యలు

Venkatayapalli: వెంకటాయపల్లిలో పోచమ్మ గుడికి వెళ్లే దళితులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో శ్రావణ మాసం బోనాల సందర్భంగా పోచమ్మ గుడికి దళితులు వెళ్లే దారిని మూసివేసి అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని KVPS, DBF నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామాన్ని సందర్శించి, దారి మూసివేసిన ప్రాంతాన్ని పరిశీలించి, దళితులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా DBF జాతీయ కార్యదర్శి పి.శంకర్, KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆడివయ్య మాట్లాడుతూ...

అనేక దశాబ్దాలుగా దళితులు పోచమ్మ గుడికి బోనాలు తీస్తున్నారని, ఈ ఏడాది శ్రావణ మాసంలో బోనాలు తీయడానికి వెళ్తుంటే లంబ మహేష్, వెంకటేష్ లు ట్రాక్టర్ అడ్డం పెట్టి అడ్డుకున్నారని తెలిపారు. గ్రామ కంఠం భూమి నుండి గుడికి దారి ఉందని, ఆ భూమిని కొందరు కబ్జా చేస్తున్నా MPDO, MPO, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దారి గురించి మాట్లాడడానికి వెళ్లిన దళితులను కులం పేరుతో దూషించి దాడి చేశారని, సెప్టెంబర్ 10న ఫిర్యాదు చేస్తే అక్టోబర్ 7న పోలీసులు కేసు నమోదు చేశారని, అట్రాసిటీ కేసు నమోదైనా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోనే దళితులపై దాడుల పరంపర కొనసాగడం దురదృష్టకరమని, దాడులకు పాల్పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సిరెడ్డి అండగా నిలవడం సిగ్గుచేటని విమర్శించారు.

డిమాండ్లు:

- దారి మూసివేసి, దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

- గ్రామ కంఠం భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, నిర్లక్ష్యం వహించిన MPDO, MPO, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి

- జాయింట్ సర్వే చేసి దళితులకు గుడికి వెళ్లే దారి చూపాలి

ఉద్యమ కార్యాచరణ:

నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న కోనాయిపల్లి నుండి తూప్రాన్ DSP కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, స్పందించకుంటే నవంబర్ 11, 12 తేదీల్లో కలెక్టరేట్ ముందు 48 గంటల నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో DBF తూప్రాన్ డివిజన్ అధ్యక్షులు పంచమి చంద్రం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బొడ్డు రాజు, గ్రామస్తులు కె.స్వామి, బి.శేఖర్, కె.కనకరాజు, బి.నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN