Medak: సూరారంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు!

Medak: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో గుప్త నిధుల కోసం అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న 9 మందిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

RAJU,TOOPRAN
Published on: 27 Oct 2026 10:31 AM IST
Medak
X

Medak: సూరారంలో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు!

Medak: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో గుప్త నిధుల కోసం ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్న ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు.

గ్రామ శివారులోని పాడుబడ్డ బావి వద్ద అర్ధరాత్రి మంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ 9 మంది వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

వెల్దుర్తి మండలం రామాయంపల్లి సర్పంచ్ భర్త మహేందర్, అతని కుమారుడు కూడా ఈ క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిందితుల వద్ద నుండి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న 9 మందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో మూఢ నమ్మకాలతో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN