Toopran: డ్రగ్స్ నివారణే లక్ష్యం: 62 ఏళ్ల వయసులో ఢిల్లీకి సైకిల్ యాత్ర!
Toopran: డ్రగ్స్ రహిత సమాజం కోసం 62 ఏళ్ల ఇందూరు విజయలక్ష్మి భీమవరం నుంచి ఢిల్లీకి చేపట్టిన 3,000 కి.మీ సైకిల్ యాత్ర బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్‌కు చేరుకుంది.
Toopran: డ్రగ్స్ నివారణే లక్ష్యం: 62 ఏళ్ల వయసులో ఢిల్లీకి సైకిల్ యాత్ర!
తూప్రాన్: తూప్రాన్ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా 62 ఏళ్ల వయసులోనూ ఇందూరు విజయలక్ష్మి సాహసోపేతమైన సైకిల్ యాత్ర బుధవారం తూప్రాన్ మున్సిపల్ కార్యలయం చేరుకుంది మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్ ఎసై గంగరాజు స్వాగతం పలికారు... అక్కడిని నుండి గీత స్కూల్ లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల జరిగే అనార్ధాలు కుటుంబాలు నష్టం పై వివరంగా వివరించారు డిల్లీ చేరుకునే లోపు మద్య ఉన్న కళాశాల లు పాఠశాల విద్యార్థుల కు కలసి గంజాయి చాకలేట్స్ డ్రగ్స్.మత్తు పదార్థాలు తీసుకున్న అమ్మకాలు జరుగుతున్న విషయం తెలిసిన పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం నుండి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఆమె చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'నషా ముక్త్ భారత్' (డ్రగ్స్ రహిత భారత్) కార్యక్రమంలో భాగంగా ఈ యాత్రను ప్రారంభించారు. అక్టోబర్ 22న భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి యాత్ర ప్రారంభమైంది. డిసెంబర్ 10న ఢిల్లీలో ఈ యాత్ర ముగియనుంది. 50 రోజుల్లో 3,000 కిలోమీటర్లు పూర్తి చేయాలన్నది ఆమె లక్ష్యం.
మార్గమధ్యంలో కళాశాలలను సందర్శిస్తూ లక్ష మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించనున్నారు. ఇప్పటివరకు 40 కళాశాలలను సందర్శించగా, ఎంతో మంది విద్యార్థులు 'డ్రగ్స్ వ్యతిరేక సైనికులు'గా మారతామని ప్రతిజ్ఞ చేశారని విజయలక్ష్మి తెలిపారు.
"నేను సైక్లిస్ట్ ను కాదు. ఇది సైకిల్ యాత్ర కాదు, ఇది నా మిషన్. తల్లిదండ్రులను, పిల్లలను చైతన్యం చేయడమే నా లక్ష్యం. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి" అని విజయలక్ష్మి అన్నారు.
తెలంగాణలో పర్యటిస్తున్న ఆమెకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్ లో ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం ఆమెను సత్కరించి అభినందించారు. మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించి విద్యార్థులతో మాట్లాడారు. వయసు అడ్డంకి కాదని, సమాజ హితం కోసం చేపట్టే కార్యక్రమాలకు సంకల్పమే ముఖ్యమని విజయలక్ష్మి యువతకు స్ఫూర్తినిస్తున్నారు.




