Malkapur: మల్కాపూర్‌లో 423వ వారం నిర్విరామంగా స్వచ్ఛ భారత్!
Malkapur: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో 423వ వారం స్వచ్ఛ భారత్. బతుకమ్మ, దసరా వేడుకల వేళ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో వీధుల శుభ్రత!
Malkapur: మల్కాపూర్‌లో 423వ వారం నిర్విరామంగా స్వచ్ఛ భారత్!
Malkapur: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో 423వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డులో చేపట్టారు.
గ్రామంలోని పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో పెట్టుకొని గ్రామ వీధులన్నింటినీ పరిశుభ్రం చేస్తున్నామని తెలిపారు. 423 వారాలుగా నిర్విరామంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం మల్కాపూర్ కే సాధ్యమైందని, గ్రామస్తుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, రేఖ నాగరాజు గౌడ్, సరిత పరమేష్ గౌడ్, యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




