Thallapeta: బతుకమ్మ వేడుకల్లో మహిళలపై సీఐ చేయి చేసుకున్నారంటూ ఆందోళన!

Thallapeta: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో బతుకమ్మ వేడుకల్లో మహిళలపై సీఐ చేయి చేసుకున్నారంటూ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Oct 2026 7:40 AM IST
Thallapeta
X

Thallapeta: బతుకమ్మ వేడుకల్లో మహిళలపై సీఐ చేయి చేసుకున్నారంటూ ఆందోళన!

Thallapeta: దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బతుకమ్మ ఆడుతున్న మహిళలపై సీఐ చేయి చేసుకున్నారంటూ గ్రామస్థులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యుడైన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పండుగ వేళ మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఘటనాస్థలానికి చేరుకున్న కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రావు పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ గిరిజన మహిళను సైతం చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి, రాజకీయ నేతల ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఏజెంట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నారు.

రాజేందర్, ఉపసర్పంచ్‌పై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించిన జగన్ మోహన్ రావు.. బాధ్యులైన పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీసీపీ, సీపీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం డీసీపీని కలిసి ఘటనపై విచారణ జరపాలని కోరనున్నట్లు వెల్లడించారు.

బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ల ఎదుట వేలాది మందితో ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని, ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.