Penchikalpet: పెంచికల్‌పేట రేంజ్ పరిధిలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం!
Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేటలో వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులతో కలిసి అటవీ శాఖ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
Penchikalpet: పెంచికల్‌పేట రేంజ్ పరిధిలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభం!
Penchikalpet: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల (02.10.2026 నుండి 07.10.2026 వరకు) సందర్భంగా శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఎల్లూర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎల్లూర్ గ్రామం నుండి ఎల్కపల్లి గ్రామం వరకు అటవీ శాఖ అధికారులు భారీ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్థానికులకు అడవులు వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు మరియు మూగజీవాల పాత్ర ఎంత కీలకమైనదో అధికారులు వివరించారు.
వన్యప్రాణులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో పెంచికల్‌పేట డిప్యూటీ రేంజ్ అధికారి (DRO) అస్మా, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు (FSO) అహ్మద్ అలీ, గోవింద్, ఫారెస్ట్ బీట్ అధికారులు (FBO) సతీష్, కళ్యాణ్, సంగదీప్, స్వర్ణలతలతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు రాజేష్, రాథోడ్ గోకుల్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




