Asifabad: ఆసిఫాబాద్‌లో ఘనంగా జాతీయ వన్యప్రాణి వారోత్సవాల ర్యాలీ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Asifabad: ఆసిఫాబాద్‌లో ఘనంగా జాతీయ వన్యప్రాణి వారోత్సవాల ర్యాలీ!
Asifabad: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ‘వన్యప్రాణులను రక్షిద్దాం అడవులను కాపాడుదాం’ అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాధాన్యత, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ సర్దార్ గోవింద్ మాట్లాడుతూ వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అడవులను నాశనం చేయకుండా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
వన్యప్రాణులను వేటాడటం, వాటికి హాని కలిగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అడవుల్లో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
“అడవులు ఉంటేనే వన్యప్రాణులు ఉంటాయి వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ సమతుల్యత కొనసాగుతుంది” అని ఎఫ్‌ఆర్‌ఓ సర్దార్ గోవింద్ పేర్కొన్నారు.




