Kaghaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా వన్యప్రాణుల వారోత్సవాలు ప్రారంభం!

Kaghaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో వన్యప్రాణుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అటవీ సంరక్షణపై అవగాహన కల్పిస్తూ అధికారులు ర్యాలీ నిర్వహించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 2 Oct 2026 4:13 PM IST
Kaghaznagar
X

Kaghaznagar: కాగజ్‌నగర్‌లో ఘనంగా వన్యప్రాణుల వారోత్సవాలు ప్రారంభం!

Kaghaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో వన్యప్రాణుల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి

అక్టోబర్ 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.

కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ర్యాలీకి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ టి. భార్గవ్ కుమార్, IFS కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యం వహించారు. అటవీ సంపద, వన్యప్రాణుల ప్రాముఖ్యతను వివరిస్తూ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో అడవులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు వన్యప్రాణులను రక్షించడం, అడవులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR