Asifabad: చింతలమానేపల్లిలో ఘనంగా జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో వన్యప్రాణుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Asifabad: చింతలమానేపల్లిలో ఘనంగా జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతలమానేపల్లి మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
వన్యప్రాణుల సంరక్షణ అడవుల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కర్జెల్లి రేంజ్ అధికారి ఏ.సుభాష్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ, ఏ.ప్రభాకర్, ఇమ్రాన్ ఎబిఒ, వై.తిరుపతి హెచ్ఎం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.




