Komuram Bheem: వంజరిలో అక్రమ ఇసుక ట్రాక్టర్ అడ్డుకున్న గ్రామస్తులు

Komuram Bheem: కాగజ్‌నగర్ వంజరిలో అక్రమ ఇసుక ట్రాక్టర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. అది సర్పంచ్ ట్రాక్టర్ కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం.

LALITH KUMAR, SIRPUR
Published on: 30 Oct 2026 5:31 PM IST
Komuram Bheem
X

Komuram Bheem: వంజరిలో అక్రమ ఇసుక ట్రాక్టర్ అడ్డుకున్న గ్రామస్తులు

కొమురం భీం జిల్లా: కాగజ్‌నగర్ మండలంలోని వంజరి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో గ్రామస్తులు ట్రాక్టర్‌ను నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ ట్రాక్టర్ సర్పంచ్‌కు సంబంధించినదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌కు సంబంధించిన ట్రాక్టర్ కావడంతోనే సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR