Asifabad: బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు, అధికారులకు విజ్ఞప్తి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అగర్గూడ గ్రామంలో బస్సు సౌకర్యం లేక 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు, బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ విజ్ఞప్తి.
Asifabad: బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు, అధికారులకు విజ్ఞప్తి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలంలోని అగర్ గూడ గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగర్ గూడ గ్రామం నుండి పెంచికల్‌పేట్ పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఉన్న ఆటో సౌకర్యం కూడా ప్రస్తుతం చార్జీలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులకు భరించలేని ఆర్థిక భారంగా మారిందని తెలిపారు.
దీంతో ఆటో చార్జీలు చెల్లించే స్తోమత లేక అనేక మంది విద్యార్థులు ప్రతిరోజూ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, ఎండలు, వర్షాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
మా గ్రామ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.




