Bellampally: ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి నిరంతరం కృషి: ఎస్.కె. హుస్సేన్
Bellampally: తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. హుస్సేన్ బెల్లంపల్లి మండల సంఘ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
Bellampally: ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి నిరంతరం కృషి: ఎస్.కె. హుస్సేన్
బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అభివృద్ధితో పాటు ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. హుస్సేన్ తెలిపారు. తన పర్యటనలో భాగంగా బెల్లంపల్లి మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధి, ఫోటోగ్రాఫర్ల భవిష్యత్తు, వృత్తిలో వస్తున్న మార్పులపై సభ్యులతో చర్చించారు.
సంఘం సభ్యుడు ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి యూనియన్ తరఫున రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, తీసుకోబోయే నిర్ణయాలను వివరించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో సభ్యులకు అవగాహన కల్పించారు. యూనియన్ మరింత బలోపేతం కావడానికి పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. హుస్సేన్‌తో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కనుకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న సుధాకర్, కుటుంబ భరోసా ఇన్చార్జి నూనె సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకునూరి రాజ్‌కుమార్, కార్యదర్శి రుకుం ప్రసాద్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆకుల వేణు, మండల ప్రధాన కార్యదర్శి గజెల్లి రఘు, మందమర్రి అసోసియేషన్ కోశాధికారి బద్రి సతీష్‌తో పాటు పలువురు ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.




