Mancherial: బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల కబ్జాపై సోషల్ మీడియా వేదికగా దుమారం!

Mancherial: బెల్లంపల్లి కన్నాల శివారులో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది.

PRATHAP, BELLAMPALLI
Published on: 31 Oct 2026 9:51 AM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల కబ్జాపై సోషల్ మీడియా వేదికగా దుమారం!

Mancherial: ​మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నాల శివారులో నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని స్థానికులు, సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

​కన్నాల శివారులోని సర్వే నంబర్ 112 పరిధిలో గల ప్రభుత్వ భూమి విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే, ఈ విలువైన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు వెలుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​నాయకులు ధర్నాల నిమిత్తం, ఢిల్లీ పర్యటనలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఈ భూ కబ్జాదారులే సమకూర్చారని, ప్రతిఫలంగానే అధికారులు కబ్జాలపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే తెరవెనుక ఉండి ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియా గ్రూపులలో పెద్దఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.

​ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సర్వే నంబర్ 112 లోని ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని నియోజకవర్గ ప్రజలు, సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI