Gundi: 20 ఏళ్లుగా అసంపూర్తిగా గుండి వంతెన!

Gundi: ఆసిఫాబాద్‌ జిల్లా గుండి గ్రామంలో 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆరుగురు యువకులు వినూత్నంగా సైకిల్‌ యాత్ర ప్రారంభించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 26 Oct 2026 9:49 AM IST
Gundi
X

Gundi: 20 ఏళ్లుగా అసంపూర్తిగా గుండి వంతెన!

Gundi: ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరుగురు యువకులు వినూత్న నిరసనకు దిగారు. కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామంలో 20 ఏళ్లుగా వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో, దాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ యువకులు సైకిల్‌ యాత్ర ప్రారంభించారు.

వంతెన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రకు శ్రీకారం చుట్టారు. తమ గ్రామ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యువకులు టీషర్టులపై ‘మాది తెలంగాణ.. మమ్మల్ని గుర్తించండి’ అనే నినాదాన్ని ముద్రించుకున్నారు. చేతుల్లో ‘హామీలు కాదు.. శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

గుండి గ్రామానికి వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధి పనులకు వెళ్లేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ప్రభుత్వంపై తమ నిరసనను వినూత్న రీతిలో తెలియజేయాలని యువకులు నిర్ణయించుకున్నారు.

సైకిల్‌ యాత్ర ద్వారా తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరనున్నట్లు యువకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం చూపాలని గుండి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.