Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు పూర్తి!
Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో వైభవంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు. శోభాయాత్రలకు సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులు, పోలీసులు.
Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు పూర్తి!
Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.
కౌటాల చింతలమానేపల్లి బెజ్జూర్ పెంచికల్పేట తదితర మండలాల గ్రామాల్లో వార్డుల్లో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనాలు నేడు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మధ్యాహ్నం శివరి పూజలు అందుకొనున్న గణనాథుడు శోభయాత్రలో బయలుదేరనున్నారు భక్తులు బారి సంఖ్యలో తరలి వచ్చి మంగళ హారతులతో స్వామి వారి శోభాయాత్రలో పాల్గొననున్నారు.
నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయా మండపాల కమిటీ సభ్యులు అధికారులు తెలిపారు. గత 9 రోజులుగా మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు అన్నదానాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 9గంటల వరకు అన్ని మండలాల్లో గణేష్ విగ్రహాల శోభాయాత్రలు ప్రారంభం కానున్నాయి. శోభాయాత్రలో భారీగా భక్తులు తరలిరానున్నారు. బాజా బజంత్రీలు డప్పు వాయిద్యాలు నృత్యాలతో కోలాహలంగా యాత్ర సాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతాల వద్ద సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు, సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు శాంతియుతంగా నిమజ్జనంలో పాల్గొనాలని నీటి వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సహకరించాలని కౌటాల సర్కిల్ పోలీసులు సూచించారు.




