Asifabad: రుద్రాపూర్ హనుమాన్ ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ఏడు రోజుల సప్తాహ కార్యక్రమం!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్ శ్రీ హనుమాన్ మందిరంలో ఏడు రోజుల సప్తాహ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.
Asifabad: రుద్రాపూర్ హనుమాన్ ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ఏడు రోజుల సప్తాహ కార్యక్రమం!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిరంలో సప్తాహ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది.
చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిరంలో ఈ రోజు అనగా బుధవారం నుండి ఏడు రోజుల పాటు సప్తాహ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని CMPL ASI మను స్థానిక సర్పంచ్ సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు.
ఏడు రోజుల పాటు జరిగే ఈ సప్తాహ కార్యక్రమంలో ప్రతిరోజూ భజనలు, హరికథలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




