Hyderabad: రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి అండ: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్!
Hyderabad: సింగరేణి భవన్‌లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి.. ఇంధన భద్రతకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Hyderabad: రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి అండ: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్!
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇంధన అవసరాలను సమర్థవంతంగా తీర్చడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును తగినంతగా సరఫరా చేస్తూ రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి మరింతగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ పురోగతిలో ప్రతి ఉద్యోగి తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సంస్థ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.
సింగరేణి సాధిస్తున్న విజయాల్లో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకులందరి భాగస్వామ్యం ఉందని సీఎండీ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




