Kagaznagar: ఈ నెల 29న కాగజ్‌నగర్‌లో సిర్పూర్ టీ గురుకుల రౌండ్ టేబుల్ సమావేశం!
Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పునర్నిర్మాణంపై ఈ నెల 29న కాగజ్‌నగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
Kagaznagar: ఈ నెల 29న కాగజ్‌నగర్‌లో సిర్పూర్ టీ గురుకుల రౌండ్ టేబుల్ సమావేశం!
Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పునర్నిర్మాణంకై ఈ నెల 29న కాగజ్ నగర్ లో భవిష్యత్తు కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కౌటాల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సమావేశం పోస్టర్లను వివిధ సంఘాల నాయకులు ఆవిష్కరించారు.
సిర్పూర్ టీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పునర్నిర్మాణం కోసం భవిష్యత్తు కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఈ నెల 29-11-2026 ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కాగజ్ నగర్ లోని విశ్రాంతి ఉద్యోగ సంఘం భవనంలో ఈ సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా కౌటాల మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్లను కౌటాల మండలంలోని వివిధ సంఘాల నాయకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మేధావులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, దళిత బహుజన ప్రజా సంఘాలు, అఖిల పక్ష పార్టీల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. గురుకుల పాఠశాల పునర్నిర్మాణం కోసం అందరూ ఏకమై పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.




