Bellampalli: 2028లో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడం నా లక్ష్యం ప్రవీణ్!

Bellampalli: మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణుకుంట్ల ప్రవీణ్ బెల్లంపల్లిలో పత్రికా సమావేశం. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ మిషన్-2028 కోసం శ్రమిస్తానని వెల్లడి.

PRATHAP, BELLAMPALLI
Published on: 14 Oct 2026 12:33 PM IST
Bellampalli
X

Bellampalli: 2028లో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడం నా లక్ష్యం ప్రవీణ్!

Bellampalli: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను ఒక క్రియాశీలక సైనికుడిగా పనిచేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న తరుణంలో ఇకపై పూర్తిస్థాయిలో ప్రజల మధ్యే ఉంటున్నానని, ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని వెల్లడించారు.

నా పదవీకాలం ముగిసినా, ప్రజా సేవకు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఎప్పుడూ ముగింపు ఉండదు. ఇకపై మరింత ఉత్సాహంగా ప్రజల గొంతుకై పోరాడుతాను. రాబోయే 2028 ఎన్నికల్లో కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే మనందరి లక్ష్యం. దీనికోసం మిషన్-2028లో భాగంగా సైనికుడిలా పని చేస్తానని" రేణుకుంట్ల ప్రవీణ్ తెలిపాడు పార్టీకి, ప్రజలకు అంకితభావంతో పనిచేస్తానని ప్రవీణ్ చేసిన ఈ ప్రకటనతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI