Kagaznagar: అరుదైన నక్షత్ర తాబేలు స్వాధీనం: అడవిలోకి విడుదల

Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధిలోని ఇస్గాంలో అరుదైన నక్షత్ర తాబేలును గుర్తించి అటవీ అధికారులు సురక్షిత ప్రాంతంలోకి విడిచిపెట్టారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 25 Sept 2026 4:41 PM IST
Kagaznagar
X

Kagaznagar: అరుదైన నక్షత్ర తాబేలు స్వాధీనం: అడవిలోకి విడుదల

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ రేంజ్ పరిధిలో అరుదైన నక్షత్ర తాబేలు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు తాబేలును స్వాధీనం చేసుకుని సురక్షిత అడవి ప్రాంతంలోకి వదిలిపెట్టారు.

కాగజ్‌నగర్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ఇస్గాం మూడో నంబర్ ప్రాంతంలోని మనీష్ నివాసంలో నక్షత్ర తాబేలు ఉన్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది.

దీంతో వేంపల్లి శిక్షణ అధికారి శశిధర్ బాబు, ఇస్గాం బీట్ అధికారులు ఎం. వాణి, దేవ్‌సింగ్ అక్కడికి చేరుకున్నారు. నక్షత్ర తాబేలును సురక్షితంగా ఆధీనంలోకి తీసుకున్నారు.

అనంతరం అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇస్గాం పరిధిలోని సురక్షిత అటవీ ప్రాంతంలో నక్షత్ర తాబేలును వదిలిపెట్టారు. అరుదైన వన్యప్రాణులను సంరక్షించేందుకు ప్రజలు సహకరించాలని అటవీ అధికారులు సూచించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR