Mancherial: ఆలయాలు, జాతరల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే
Mancherial: గూడెం గోదావరి పుష్కర ఘాట్ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు; పద్మల్‌పూరి కాకోబాయి ఆలయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పూజలు చేశారు.
Mancherial: ఆలయాలు, జాతరల అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే
: ప్రముఖ దేవాలయాలు, జాతర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పద్మాపూర్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీశాఖ నిబంధనలను గౌరవిస్తూ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు.
గోదావరి పుష్కర ఘాట్ పనుల పరిశీలన
కుమ్రంభీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండలంలోని గూడెం సమీపంలో గోదావరి తీర ప్రాంతంలో చేపట్టిన పుష్కర ఘాట్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గుడిరేవు గ్రామంలోని పద్మల్‌పూరి కాకోబాయి (ఎత్మసార్) దేవస్థానాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, డీసీపీ ఎ.భాస్కర్, ఇన్‌చార్జి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సురేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




