Mancherial: ఆల్ఫోర్స్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు, రావణ దహనం!

Mancherial: మంచిర్యాల ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు. సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు.

SUMAN, MANCHIRYAL
Published on: 7 Oct 2026 11:26 AM IST
Mancherial
X

Mancherial: ఆల్ఫోర్స్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు, రావణ దహనం!

Mancherial: ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మలను చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్బంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మన సంస్కృతి, పండుగల పట్ల అవగాహనతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

వేడుకల్లో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని నరేందర్ రెడ్డి నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పాఠశాల ఆవరణలో బతుకమ్మ వేడుకలతో పాటు రావణ దహనం కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థుల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.

SUMAN, MANCHIRYAL

SUMAN, MANCHIRYAL