Mancherial: హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి స్పందన.. కాసిపేట ఎస్ఐల బదిలీ!

Mancherial: మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐల బదిలీ వ్యవహారంపై హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి స్పందించిన పోలీస్ శాఖ. నూతన ఎస్ఐగా శ్రావణ్ బాధ్యతల స్వీకరణ.

PRATHAP, BELLAMPALLI
Published on: 24 Oct 2026 10:32 AM IST
Mancherial
X

Mancherial: హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి స్పందన.. కాసిపేట ఎస్ఐల బదిలీ!

Mancherial: మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐల బదిలీ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందంటూ గతంలో ప్రసారమైన వార్తలపై పోలీస్ శాఖ స్పందించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తూ ఎస్ఐలకు స్థాన చలనం కల్పించారు.

మల్టీజోన్-1 పరిధిలోని కాలేశ్వరం డీఐజీ కార్యాలయం నుండి గతంలోనే ఎస్ఐల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, కొందరు అధికారులు విధుల నుండి రిలీఫ్ కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మీడియాలో కథనాలు వెలువడటంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.

తాజాగా వెలువడిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాసిపేట పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఎస్ఐల మార్పులు మరియు బదిలీల ఆదేశాలను అమలు చేస్తూ తగిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి కాసిపేట ఎస్ఐగా శ్రావణ్ బాధ్యతలు స్వీకరించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI