Asifabad: లంబాడిగూడలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లంబాడిగూడలో కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. నాటుసారా, అక్రమ కార్యకలాపాలపై తనిఖీలు.

SRINIVAS, KOUTALA
Published on: 9 Oct 2026 9:45 AM IST
Asifabad
X

Asifabad: లంబాడిగూడలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, బెజ్జూర్ ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు.

గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు నాటుసారా తయారీ, అక్రమ కార్యకలాపాలపై తనిఖీలు నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24/7 పోలీసు నిఘా కొనసాగిస్తామని తెలిపారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి, అనుమానితుల వివరాలను సేకరించారు. గ్రామస్తులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

గ్రామ పెద్దలు పోలీసుల చర్యలను అభినందిస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహించాలని కోరారు. ఈ కార్డన్ సెర్చ్ లో బెజ్జూర్ ఎస్ఐ రమేష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో మరికొన్ని రోజుల పాటు ప్రత్యేక పోలీస్ గస్తీ కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA