Mancherial: ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. నిందితుడి అరెస్ట్!

Mancherial: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుళ్లబందంలో ఇంటి ఆవరణలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మూడు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

RAJENDER, CHENNUR
Published on: 7 Oct 2026 7:32 PM IST
Mancherial
X

Mancherial: ఇంటి ఆవరణలో గంజాయి సాగు.. నిందితుడి అరెస్ట్!

Mancherial: కోటపల్లి ఎస్‌ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె. లక్ష్మణరావు లు పోలీసు తమ సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు ఎదుళ్లబందం గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33), తండ్రి: చంద్రయ్య ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సమయంలో ఇంటి ఆవరణలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలకు గుర్తించిన పోలీసులు, మహేష్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మొక్కలను వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలే అని నిర్ధారించారు. వీటిలో రెండు మొక్కలు 12 అంగుళాలు, మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు ఎస్ ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మూడు మొక్కల విలువ సుమారు రూ.4,600 ఉంటుందని అంచనా వేశారు.

గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ ఐ రాజశేఖర్ సూచించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR