Chintalamanepally: కార్జేవెల్లి గ్రామంలో పెన్షన్ ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ!

Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కార్జేవెల్లి గ్రామంలో బుధవారం నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను పంపిణీ చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 18 Nov 2026 4:51 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: కార్జేవెల్లి గ్రామంలో పెన్షన్ ప్రొసీడింగ్స్ కాపీల పంపిణీ!

Chintalamanepally: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కార్జేవెల్లి గ్రామంలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ల ద్వారా అండగా నిలుస్తోంది అని తెలిపారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య & మాజీ ఎంపీపీ, చింతలమానేపల్లి కౌటాల మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకన్న, కార్జేవెల్లి సర్పంచ్ చౌదరి నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA