Penchikalpet: విద్యార్థుల పారిశ్రామిక సందర్శన - వృత్తి నైపుణ్యాలపై అవగాహన

Penchikalpet: పెంచికల్‌పేట్ పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు బెల్లంపల్లిలోని ఎస్‌బీఐ, ఎల్ఐసీ కార్యాలయాలు మరియు బ్యూటీ పార్లర్‌ను సందర్శించి వృత్తి నైపుణ్యాలు తెలుసుకున్నారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 17 Nov 2026 9:29 PM IST
Penchikalpet
X

Penchikalpet: విద్యార్థుల పారిశ్రామిక సందర్శన - వృత్తి నైపుణ్యాలపై అవగాహన

పెంచికల్‌పేట్: సమగ్ర శిక్షా తెలంగాణ ఆధ్వర్యంలో PM SHRI పాఠశాలల్లో అమలవుతున్న వృత్తి విద్యా కార్యక్రమంలో భాగంగా PM SHRI ZPHS కొమరం భీం జిల్లా పెంచికల్‌పేట్ పాఠశాల విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన (Industrial Visit / Exposure Visit) లో భాగంగా ఎల్ఐసి ఆఫీస్ బెల్లంపల్లి, మరియు sbi బ్యాంక్ బెల్లంపల్లి సందర్శించారు. ఈ సందర్శనలో BFSI (Banking, Financial Services and Insurance) విభాగాలకు చెందిన విద్యార్థులు వివిధ వృత్తి రంగాల పనితీరుపై ప్రత్యక్ష అవగాహన పొందారు.

BFSI విద్యార్థులు నేర్చుకున్న అంశాలు:

- బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించే విధానం, KYC ప్రక్రియ.

- నగదు జమ, ఉపసంహరణ, పాస్‌బుక్ నిర్వహణ.

- ATM, డెబిట్ కార్డు, UPI, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు.

- NEFT, RTGS వంటి నగదు బదిలీ విధానాలు.

- బ్యాంకు ఉద్యోగుల విధులు, ఖాతాదారులకు అందించే సేవలు.

- జీవిత బీమా ప్రాముఖ్యత, LIC పాలసీల ఉపయోగాలు.

- బీమా ప్రీమియం, నామినీ, మెచ్యూరిటీ, క్లెయిమ్ ప్రక్రియలు.

మరియు

Beauty & Wellness హలో భాగంగా MAGISA బ్యూటీ పార్లర్ సందర్శచారు.

విద్యార్థులు నేర్చుకున్న అంశాలు:

- వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యత.

- చర్మం, జుట్టు సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక విధానాలు.

- బ్యూటీ పార్లర్‌లో అందించే వివిధ సేవలు.

- ఫేషియల్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ వంటి ప్రాథమిక ప్రక్రియలు.

- బ్యూటీషియన్ ఉపయోగించే పరికరాలు, వాటి వినియోగ విధానం.

- పరిశుభ్రత, శానిటేషన్, కస్టమర్ సర్వీస్ ప్రాముఖ్యత.

- బ్యూటీ & వెల్‌నెస్ రంగంలో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.

ఈ సందర్శన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకునే అవకాశం పొందారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ నిర్మల మరియు యాదగిరి, బడే సాహెబ్ భాగ్యశ్రీ ఆత్మరామ్ సమ్మయ్య భారతి నాగరాణి విజయ్ మౌనిక,అమ్మా ఆదర్శ కమిటీ చైర్మన్ స్వప్న పుత్తర్ సింగ్ మరియు సంధ్య మొదలగువారు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇలాంటి క్షేత్రస్థాయి సందర్శనలు పుస్తక పరిజ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి, భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడానికి మరియు స్వయం ఉపాధి ప్రారంభించడానికి ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR