Mancherial: రాష్ట్రస్థాయి కుంగ్-ఫు పోటీల్లో వశిష్ట స్కూల్ విద్యార్థుల ప్రభంజనం!
Mancherial: మంచిర్యాలలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కుంగ్-ఫు పోటీల్లో ఓదెల మండలం పోత్కపల్లి వశిష్ట స్కూల్ విద్యార్థినుల ప్రతిభ: గ్రూప్, ఇండివిజువల్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ కైవసం.
Mancherial: రాష్ట్రస్థాయి కుంగ్-ఫు పోటీల్లో వశిష్ట స్కూల్ విద్యార్థుల ప్రభంజనం!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సోమగూడెంలోని త్రినేత్ర గార్డెన్‌లో ఈనెల 20న నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కుంగ్ - ఫు, కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లికి చెందిన 'వశిష్ట స్కూల్' విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు.
'డ్రాగన్స్ కుంగ్-ఫు' విభాగంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
జూనియర్స్ గ్రూప్ నాన్-చాక్ కాటాస్: దుగ్యాల అభిసస్య, గజ్జి శాన్వి, బోగె ఆధ్యశ్రీలు అత్యుత్తమ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించారు.
ఇండివిజువల్ నాన్-చాక్ కాటాస్: శ్రీపతి మోక్ష గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. విజేతలకు స్కూల్ ప్రిన్సిపాల్ మ్యాడగొని కిషన్, ఉపాధ్యాయ బృందం, డ్రాగన్స్ కుంగ్-ఫు గ్రాండ్ మాస్టర్ కొండిల్ల సదానందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.




