Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బైక్ అదుపుతప్పి ప్రమాదం స్థానికంగా శోకసంద్రం
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డబ్బా బోదంపల్లి రహదారిపై బైక్ అదుపుతప్పి పడిన ప్రమాదంలో గంగాపూర్ గ్రామానికి చెందిన జాడే అజయ్ మృతి చెందగా, ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో బైక్ అదుపుతప్పి ప్రమాదం స్థానికంగా శోకసంద్రం
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి డబ్బా బోదంపల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలమానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన జాడే అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా దుర్గం ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




