Asifabad: దిందా శివారులో హృదయ విదారక ఘటన.. నాలీలో పసికందు మృతదేహం లభ్యం!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులోని నాలీలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన పసికందు మృతదేహం లభ్యమైంది.

SRINIVAS, KOUTALA
Published on: 12 Nov 2026 11:27 AM IST
Asifabad
X

Asifabad: దిందా శివారులో హృదయ విదారక ఘటన.. నాలీలో పసికందు మృతదేహం లభ్యం!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలి వెళ్లారు.

దిందా గ్రామ శివారులోని నాలీలో ఒక కవర్లో పసికందు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కవర్ ను కుక్కలు బయటకు లాగడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే పసికందు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకున్న చింతలమానేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందును ఎవరు, ఎందుకు వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో దిందా గ్రామంలో విషాదం నెలకొంది. పసికందును ఇలా వదిలి వెళ్లడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA