Bellampalli: బెల్లంపల్లి–గడ్చిరోలి జాతీయ రహదారి మంజూరు చేయండి!
Bellampalli: బెల్లంపల్లి–గడ్చిరోలి నూతన జాతీయ రహదారిని మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు.
Bellampalli: బెల్లంపల్లి–గడ్చిరోలి జాతీయ రహదారి మంజూరు చేయండి!
బెల్లంపల్లి, అక్టోబర్ 13: బెల్లంపల్లి–గడ్చిరోలి మధ్య నూతన జాతీయ రహదారిని మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలోని నితిన్ గడ్కరీ అధికారిక నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బెల్లంపల్లి నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ రహదారి మంజూరైతే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అంతర్రాష్ట్ర అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. బెల్లంపల్లి–గడ్చిరోలి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిని తప్పకుండా మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.




