Mancherial: ఇందారం దుర్ఘటన బాధిత కుటుంబాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శ

Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో నీటి గుంతలో పడి ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ విచారం వ్యక్తం చేసి కుటుంబాలను పరామర్శించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 25 Oct 2026 10:36 PM IST
Mancherial
X

Mancherial: ఇందారం దుర్ఘటన బాధిత కుటుంబాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శ

మంచిర్యాల: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన తీవ్ర విచారం కలిగించిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మృతదేహాలకు నివాళులు

మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీని సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ.. మృతదేహాలకు నివాళులర్పించారు. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు తీరని లోటు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే అప్రమత్తం కావాలని ఎంపీ సూచించారు. ప్రమాదకరమైన నీటి గుంతలు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో రక్షణ కంచెలు నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రాంతాలను గుర్తించి, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.