Jaipur: జైపూర్‌లో 320 స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ఎంపీ వంశీ
Jaipur: మంచిర్యాల జిల్లా జైపూర్ జడ్పీ స్కూల్ విద్యార్థులకు కాకా ట్రస్ట్ ద్వారా 320 స్కూల్ బ్యాగులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేసి, వారితో కలిసి భోజనం చేశారు.
Jaipur: జైపూర్‌లో 320 స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ఎంపీ వంశీ
జైపూర్: జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 320 స్కూల్ బ్యాగులను పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు, విద్య బలోపేతానికి నేను మా ఫ్యామిలీ ఎప్పుడు కృషి చేస్తాం-ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.
జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కాకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులకు 320 స్కూల్ బ్యాగులను ఆయన అందజేశారు.
అనంతరం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతతో పాటు ఉదయం అల్పాహారం వివరాలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
భోజనం రుచి, నాణ్యత ఎలా ఉన్నాయో పిల్లలను ఆరా తీశారు. అలాగే ఉదయం అందించే టిఫిన్ గురించి కూడా విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ..!
విద్య ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, తమ తాతగారు 'కాకా' వెంకటస్వామి నాటి నుంచి కూడా విద్యారంగానికి తమ కుటుంబం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. తాత అడుగుజాడల్లోనే తన నాన్న వివేక్ వెంకటస్వామి మరియు తాను కూడా విద్యారంగ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలో విద్యార్థుల చదువుల కోసం ఇప్పటివరకు మంత్రి వివేక్ వెంకటస్వామి 10 కోట్లు అలాట్ చేయడం జరిగిందని , అలాగే చెన్నూరు నియోజకవర్గం లోని సోమనపల్లి గ్రామం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సుమారు 200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కానుందని, ఇది పూర్తయితే సుమారు 2000 మంది విద్యార్థులకు అత్యుత్తమ వసతులతో కూడిన ఉచిత విద్య అందుతుందని చెప్పారు. విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లి కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.




