Mancherial: కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు
Mancherial: దండేపల్లిలో కొమురం భీం విగ్రహాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి ఆవిష్కరించారు.
Mancherial: కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు
మంచిర్యాల: ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. ఆదివాసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో ఏర్పాటు చేసిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఆదివాసీ కుటుంబాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




