Koutala: మిర్చి రైతులకు 18 గంటల విద్యుత్ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు!

Koutala: కౌటాల, చింతలమానేపల్లి మిర్చి రైతులకు 18 గంటల కరెంట్ ఇస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కౌటాలలో అధికారులతో సమీక్షించారు.

SRINIVAS, KOUTALA
Published on: 16 Oct 2026 10:52 PM IST
Koutala
X

Koutala: మిర్చి రైతులకు 18 గంటల విద్యుత్ సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు!

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిర్చి రైతుల సమావేశంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మిర్చి రైతుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు , రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారుల తో మిర్చి రైతుల సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. మిర్చి రైతుల సూచన మేరకు 18 గంటలకు తక్కువ కాకుండా కరెంటు సరఫరా చేసి మిర్చిని సాగు చేస్తున్న రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. 10 సంవత్సరాల్లో 10 ఎకరాలకు నీళ్లు పారించలేని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యవసాయం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని తెలిపారు.

కోట్ల రూపాయల ఓఆర్సి నిధులను రైతుల నుంచి రాబట్టి వేల కలెక్షన్లు ఇవ్వలేకపోయారని, తాము ఎటువంటి ఓ.ఆర్.సి చార్జీలు వసూలు చేయకుండా వేలాది కనెక్షన్లు అన్ని మండలాల్లో ఇచ్చామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తొమ్మిది 33KV సబ్ స్టేషన్ ల నిర్మాణం జరుగుతుందని, మరో 132 KV నిర్మాణం కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ ఉద్యాన శాఖ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్యంతో పనిచేసి వరి రైతులను మరియు మిర్చి రైతులను ఆదుకోవాలని తెలిపారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి తరలించి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిందని, ఏ రోజు కూడా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో గాని బయట గాని మాట్లాడని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రైతుల గురించి,?రైతాంగం గురించి మాట్లాడడం అన్యాయమని అన్నారు.

రైతులకు కరెంటు సరఫరా, విత్తనాల సరఫరా, మందుల సరఫరా , యూరియా, డిఏపి సరఫరాలో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే రైతులు పండించిన పంటకు పూర్తి మద్దతు ధర దక్కేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీమ్, విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తం జాడే, విద్యుత్ శాఖ డి ఈ నాగరాజు, ఏఈ అంజల్ కుమార్, ఏవో నాగరాజు, హార్టికల్చర్ ఆఫీసర్ సుప్రజ, ఏఈవోలు, మిర్చి రైతులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA