Chintalamanepally: బాలాజీ అనుకోడలో పూలేకు ఎమ్మెల్యే హరీష్ బాబు నివాళులు

Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు నివాళులర్పించారు.

SRINIVAS, KOUTALA
Published on: 28 Nov 2026 6:22 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: బాలాజీ అనుకోడలో పూలేకు ఎమ్మెల్యే హరీష్ బాబు నివాళులు

చింతలమానేపల్లి: మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు నివాళులర్పించారు. చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే సామాజిక సంస్కరణల పితామహుడు అని, మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి, సమానత్వ సమాజ స్థాపన కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పూలే ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, మండలానికి చెందిన సర్పంచులు మరియు అధికారులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA