Sirpur: కపాస్ క్రాంతి మిషన్‌తో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి: సిర్పూర్ ఎమ్మెల్యే!
Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అగర్‌గూడలో కపాస్ క్రాంతి మిషన్ పత్తి చేలను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కాలినడకన వెళ్లి పరిశీలించారు.
Sirpur: కపాస్ క్రాంతి మిషన్‌తో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి: సిర్పూర్ ఎమ్మెల్యే!
సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని అగర్‌గూడ గ్రామనికి చెందిన పలువురు రైతులు కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ కాంతి మిషన్ ద్వారా పత్తి విత్తనాలు పొందిన వారి పత్తి చేలను పరిశీలించడానికి సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయ అధికారులను వెంటబెట్టుకొని రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ, బొక్కి వాగు దాటుతూ వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక సాంద్రతతో నాటిన పత్తి మొక్కలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని, ఎకరానికి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పత్తి సాగులో అధిక దిగుబడి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కపాస్ క్రాంతి మిషన్ ప్రవేశపెట్టిందని, దాని ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలతో పాటు పిచికారి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం ఆగరుగూడ గ్రామపంచాయతీ భవనంలో రైతులకు ఉచితంగా బయో స్టిములెంటు మందులు మరియు దోమ నివారణ మందులను పంపిణీ చేశారు. రైతులకు గత మూడు సంవత్సరాలుగా తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మెరుగైన సేవలందిస్తున్నామని , యూరియా మరియు డిఏపి సరఫరాను క్రమబద్ధీకరించామని తెలిపారు.
పూర్తిస్థాయిలో వరి పత్తి మరియు మక్క రైతులకు మద్దతు ధర లభిస్తుందని, గతంలో మాదిరిగా అడ్డగోలు కట్టింగులు లేకుండా చేశామని చెప్పారు. గ్రామాలు మరియు పట్టణం ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి వైపు నడుస్తున్నాయని అన్నారు. ఎక్కడా అక్రమ కేసులు, భూకబ్జాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం సాధించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అగర్‌గూడ సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి డా. వెంకటి, ఏవో రామకృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్త డా. మధు , సర్పంచులు భక్తు రాంచందర్, చప్పిడే రవీందర్,కృష్ణవేణి - హరీష్, ఉమా మహేష్, నాయకులు బోదాసు మాధవి, కుకుడే రాజేశ్వర్, నార వనజ, బండి ప్రభాకర్, డోకె నారాయణ, పాలే సంతోష్, కాంతా రావు తదితరులు పాల్గొన్నారు.




