Mancherial: చెన్నూరులో రూ.3.30 కోట్లతో నిర్మించిన నూతన బీసీ హాస్టల్ ప్రారంభించిన మంత్రి!
Mancherial: చెన్నూరు పట్టణంలో రూ.3.30 కోట్లతో నిర్మించిన నూతన బీసీ వసతి గృహ భవనాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించి, విద్యారంగ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Mancherial: చెన్నూరులో రూ.3.30 కోట్లతో నిర్మించిన నూతన బీసీ హాస్టల్ ప్రారంభించిన మంత్రి!
Mancherial: చెన్నూరు నియోజకవర్గం లో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతస్థాయిలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
చెన్నూరు పట్టణంలో సుమారు రూ. 3 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వెనుక బడిన తరగతుల (BC) వసతి గృహ భవనాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
నియోజకవర్గంలోని పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి వివేక్ కామెంట్స్ ....!
రాష్ట్రంలో విద్య కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము.
టామ్ కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో సుమారు 250 కోట్ల రూపాయల నిధులతో 2500 మందికి సరిపడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రవర్తయి వచ్చే సంవత్సరంలోగా ప్రారంభోత్సవం జరుపుతామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభమైన తర్వాత స్థానిక విద్యార్థిని విద్యార్థులకు అన్ని వసతులతో మెరుగైన విద్య అందుతుందని వివరించారు.




