Mandamarri: కాంగ్రెస్ భారీ ధర్నా.. సీఈసీ రాజీనామాకు డిమాండ్!
Mandamarri: మంచిర్యాల జిల్లా మందమర్రిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ధర్నా. ఓట్ల తొలగింపుపై సీఈసీ రాజీనామా చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్.
Mandamarri: కాంగ్రెస్ భారీ ధర్నా.. సీఈసీ రాజీనామాకు డిమాండ్!
Mandamarri: కేంద్ర ప్రభుత్వ వైఖరికి, ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు మందమర్రి పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఓట్ల తొలగింపు ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే చర్యలను సహించబోమని పేర్కొంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ విభాగం, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




