Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మంత్రి గడ్డం వివేక్ దసరా వేడుకలు!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు కుటుంబ సమేతంగా ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Oct 2026 12:25 PM IST
Chennur
X

Chennur: చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మంత్రి గడ్డం వివేక్ దసరా వేడుకలు!

Chennur: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తన సతీమణి, విశాఖ మైనింగ్ డైరెక్టర్ సరోజ వివేక్‌తో కలిసి కుటుంబ సమేతంగా దసరా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. అనంతరం శమీ పూజ (జమ్మి పూజ) చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి దసరా వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఐక్యతతో, సంతోషంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సమష్టిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.