Asifabad: అడెపల్లిలో రెండవ రోజు వైద్య శిబిరం, ఏసీఎం స్ప్రే కార్యక్రమం!

Asifabad: అడెపల్లిలో రెండవ రోజు ఉచిత వైద్య శిబిరం, ఇంటింటికీ ఏసీఎం స్ప్రే కార్యక్రమం. దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అధికారుల అవగాహన.

SRINIVAS, KOUTALA
Published on: 10 Oct 2026 10:11 AM IST
Asifabad
X

Asifabad: అడెపల్లిలో రెండవ రోజు వైద్య శిబిరం, ఏసీఎం స్ప్రే కార్యక్రమం!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం అడెపల్లి గ్రామపంచాయతీలో రెండవ రోజు వైద్య శిబిరం మరియు ఇంటింటికీ ఆల్ఫాసైపర్ మెథ్రిన్ (ACM) స్ప్రే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు, దోమల బెడద నివారణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆల్ఫాసైపర్ మెథ్రిన్ పిచికారీ చేసి, దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సర్పంచ్, సుగణ పంచాయతీ కార్యదర్శి, శ్రీలత MLHP, రామలింగం HA, సునీత HE, శైలజ ANM, మరియు పద్మ ఆశా తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA