Mancherial: మంచిర్యాల RK5 గని ఆవరణలో ఘనంగా చండీ హోమం, ఆధ్యాత్మిక పూజలు!
Mancherial: మంచిర్యాల RK5 గని ఆవరణలో దుర్గా నవరాత్రి ఉత్సవాల వేళ చండీ హోమంలో పాల్గొన్న మేయర్ దర్ని మధుకర్. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నదానం పంపిణీ.
Mancherial: మంచిర్యాల RK5 గని ఆవరణలో ఘనంగా చండీ హోమం, ఆధ్యాత్మిక పూజలు!
Mancherial: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని RK5 గని ఆవరణలో నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మేయర్ దర్ని మధుకర్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో గని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మేయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, INTUC జిల్లా అధ్యక్షుడు పుదరి తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, INTUC పిట్ సెక్రటరీ నంబయ్య, INTUC నాయకుడు చంద్ర మోహన్, NSUI నాయకుడు భరత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




