Mancherial: మంచిర్యాల ఆసుపత్రి సమీపంలో పేకాట.. ఐదుగురు అరెస్ట్!
Mancherial: మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రూ.7,500 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Mancherial: మంచిర్యాల ఆసుపత్రి సమీపంలో పేకాట.. ఐదుగురు అరెస్ట్!
మంచిర్యాల: బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఐదుగురిని మంచిర్యాల పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,500 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఏ. మధుసూదన్ రావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నారు.
పట్టుబడిన వారిలో ఎం.డి. ఖలీల్ (ఫ్లడ్ కాలనీ, సీసీసీ నస్పూర్), కాంపెల జక్కయ్య (వేముల బస్తీ, మంచిర్యాల), ఎస్.కె. షాహిద్ (బైపాస్ రోడ్, మంచిర్యాల), హరిదాసు శ్రవణ్ (కాలేజ్ రోడ్, మంచిర్యాల), జుగురు కుమార్ (హమాలీవాడ, మంచిర్యాల) ఉన్నారు.
వారి వద్ద నుంచి పేకాటకు ఉపయోగించిన రూ.7,500 నగదు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం, పేకాటకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




