Mancherial: బోయపల్లిలో బతుకమ్మ సంబరాల వేళ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు!

Mancherial: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిలో బతుకమ్మ సంబరాల వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. సిరంగి శ్రీనివాస్ ఇంట్లో బంగారం, నగదు, వెండి అపహరణ.

PRATHAP, BELLAMPALLI
Published on: 19 Oct 2026 11:21 AM IST
Mancherial
X

Mancherial: బోయపల్లిలో బతుకమ్మ సంబరాల వేళ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు!

Mancherial: మంచిర్యాలజిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో అర్ధరాత్రి వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్తులంతా బతుకమ్మ సంబరాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కొందరు దుండగులు ఇదే అదనుగా భావించి పలు ఇళ్లలో చోరీకి యత్నించారు. ఈ క్రమంలోనే సిరంగి శ్రీనివాస్ ఇంట్లోకి దూరిన దొంగలు కుటుంబ సభ్యులు బయట ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, లోపల నుంచి ఇంటి తలుపులను తాళ్లతో కట్టి దొంగతనం చేశారు.

ఇంట్లోని మూడు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు సుమారు 20 తులాల వెండి అపహరించి పరారయ్యారు. సంబరాలు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉండటం, ఎంతకీ తలుపులు రాకపోవడంతో ఇంటి యజమానులు పరిశీలించగా చోరీ జరగడం చూసి బాధితులు లబోదిబోమన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాండూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.. తమ న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI