Mancherial: లారీ ఢీకొని గొర్రెల మృతి.. బాధితుడికి చిన్నయ్య పరామర్శ!
Mancherial: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తక్కళ్లపల్లి వద్ద లారీ ఢీకొని 27 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు మురికి బీరయ్యను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు.
Mancherial: లారీ ఢీకొని గొర్రెల మృతి.. బాధితుడికి చిన్నయ్య పరామర్శ!
Mancherial: తాండూర్ మండలం రేచినికి చెందిన మురికి బీరయ్యకు చెందిన 27 గొర్రెలు లారీ ఢీకొని మృతి చెందాయి. తక్కళ్లపల్లి వద్ద ఈ ప్రమాదం సంభవించగా విషయం తెలుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంఘటన స్థలానికి వెళ్లి బీరయ్యను పరామర్శించి మాట్లాడారు.
ప్రమాద విషయంలో బీరయ్యకు తగిన నష్టపరిహారం అందేలా అధికారులతో మాట్లాడతానని హామీనిచ్చారు. ఆయన వెంట బీ ఆర్ ఎస్ తాండూర్ మండల అధ్యక్షుడు దత్తుమూర్తి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సుందర్ రావు,మాజీ ఎంపీటీసీ మొగిలి శంకర్ ఉన్నారు.




