Mancherial: NHM ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ సంఘీభావం
Mancherial: మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట 31వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ సంఘీభావం.
Mancherial: NHM ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ సంఘీభావం
మంచిర్యాల: ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరింది. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు కొనసాగిస్తున్న ఆందోళన శిబిరానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన NHM ఉద్యోగులపై అప్పట్లో ప్రశంసలు కురిపించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే ఉద్యోగులను రోడ్డున పడేసి శ్రమదోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. సమ్మెలో 80 శాతానికి పైగా మహిళా ఉద్యోగులే ఉన్నారని, చంటిపిల్లలతో సైతం ఎండలో దీక్షలకు కూర్చోవడం బాధాకరమని అన్నారు.
NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడదని పేర్కొంటూ.. అలాంటప్పుడు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి ఉద్యోగుల ప్రతినిధులతో తక్షణమే చర్చలు జరపాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. NHM ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి తెలంగాణ రక్షణ సేన పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.




