Mancherial: వరుస దొంగతనాల ముఠాను పట్టుకున్న తాండూర్ పోలీసులు!
Mancherial: బెల్లంపల్లి డివిజన్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన తాండూర్ పోలీసులు. రూ.50 వేల నగదు, 2 బైకులు, కాపర్ వైర్ స్వాధీనం.
Mancherial: వరుస దొంగతనాల ముఠాను పట్టుకున్న తాండూర్ పోలీసులు!
Mancherial: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి డివిజన్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల ముఠాను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లే లక్ష్యంగా వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తాండూర్, భీమిని, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి రూ.50,000 నగదు, రెండు బైకులు, ఐదు మొబైల్ ఫోన్లు, 10 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించి రివార్డులు అందజేశారు.




