Mancherial: రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ఏర్పాటుకు కసరత్తు

Mancherial: మంచిర్యాల జిల్లాలో రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ఏర్పాటుకు ఏర్పాట్లు. 34.42 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. మంత్రి వివేక్ ప్రకటన.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 24 Sept 2026 9:23 PM IST
Mancherial
X

Mancherial: రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ఏర్పాటుకు కసరత్తు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 గనిని త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. ఈ గనిలో సుమారు 34.42 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.. దాదాపు 18 ఏళ్ల పాటు మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది.. గని ప్రారంభమైతే బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి..

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2 గనిని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.. అటవీ అనుమతులు వచ్చిన వెంటనే గని పనులు చేపడతామని తెలిపారు..

రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్-2లో సుమారు 34.42 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 18 సంవత్సరాల పాటు మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు అవకాశం ఉంది.. గని అందుబాటులోకి వస్తే సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు..

సింగరేణికి కొత్త గనులు కేటాయించడంతో పాటు.. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు.. కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించామని పేర్కొన్నారు..

అయితే గత ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన బొగ్గు బ్లాకుల వేలం విధానానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. సింగరేణిని వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని మంత్రి ఆరోపించారు.. గత పదేళ్లలో సింగరేణికి కొత్త బొగ్గు గని దక్కలేదని విమర్శించారు..

మరోవైపు సింగరేణి స్థలాల్లో కార్మికులు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చే అంశంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.. కొత్త గనులు, కొత్త ఉద్యోగాల ద్వారా సింగరేణిని బలోపేతం చేసి సంస్థకు గత వైభవాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు..

తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి పెరిగితే విద్యుత్ రంగంతో పాటు పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలుగుతుందని.. సింగరేణి ఆదాయం, లాభాలు పెరిగితే కార్మికుల సంక్షేమానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది..

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.