Chennur: చెన్నూర్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో పోలీసుల ముమ్మర గంజాయి తనిఖీలు

Chennur: చెన్నూర్‌లో గంజాయి అణచివేతకు పోలీసుల ప్రత్యేక తనిఖీలు. నార్కోటిక్ డాగ్ టీమ్‌తో లంబాడిపల్లి, ఎల్లక్కపేటల్లో సోదాలు నిర్వహించిన సీఐ బన్సీలాల్, సిబ్బంది.

RAJENDER, CHENNUR
Published on: 28 Sept 2026 4:21 PM IST
Chennur
X

Chennur: చెన్నూర్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో పోలీసుల ముమ్మర గంజాయి తనిఖీలు

చెన్నూర్: చెన్నూర్ మండలం లంబాడిపల్లి శివారులో మూతబడిన సింగరేణి మైనింగ్ ఏరియా నందు నార్కోటిక్ డాగ్ టీం తో కలసి తనిఖీలు చేపట్టిన చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ రాజశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది. గంజాయి సేవించే లేదా అమ్మకాలు జరిపే వారిపై నిత్యం పకడ్బoదిగా నిఘా ఏర్పాటు చేయడమే గాక నార్కోటిక్ డాగ్ టీం తో తరచు పట్టణంలో తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.

అదేవిదంగా ఈరోజు ఎల్లక్కపేట గ్రామంలోని గంజాయి సేవించే అనుమానస్పద వ్యక్తుల ఇళ్లలో నార్కోటిక్ డాగ్ టీం తో కలసి ముమ్మర తనిఖీలు చేపట్టడం జరిగింది.

గంజాయి రహిత సమాజం కోసం విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే గాక గంజాయి ని అరికట్టుటకు పోలీసులు నార్కోటిక్ టీం ద్వారా చేపట్టే ఇలాంటి తనిఖీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి, అందుకు ప్రజలు కూడా గంజాయి సేవించే, అమ్మకాలు జరిపే సరఫరా చేసే వారి వివరాలు పోలీస్ కి డయల్ 112 ద్వారా లేదా నేరుగా గాని లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని వివరాలు ఇచ్చే వారి సమాచారం గొప్యంగా ఉంచబడుతుంది.

చెన్నూర్ పట్టణం మరియు మండలంలో గంజాయి సేవించే వారి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి మెడికల్ టెస్ట్ నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి పంపి మెడికల్ టెస్ట్ అనంతరం వారిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపడం జరుగుతుంది.

ఎవరైనా గంజాయి సేవించిన, అమ్మిన, లేదా సరఫరా చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే గాక వారిని పీడీ యాక్ట్ లో జైలుకు పంపడం జరుగుతుంది.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR